close

మంగళవారం, ఆగస్టు 14, 2018

తాజా వార్తలు

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన 

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన 

శాంతినగర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను సోమవారం మంత్రి జోగు రామన్న పరిశీలించారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని డైట్‌ మైదానంలో జరుగనున్న బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు హెలిక్యాప్టర్‌ ఆగే విమానాశ్రయ స్థలాన్ని ఆయన తెరాస నాయకులతో కలిసి పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్న పోలీసు బందోబస్తుపై ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌తో సమీక్షించారు. సభావేదికతో పాటు శాంతి భద్రతల దృష్ట్యా బారీకేడ్లు, సమావేశం స్థలంలో జరుగుతున్న పనులు, ప్రజాప్రతినిధుల రాకపోకలు తదితర ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి తప్పిదం జరగకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగే విమానాశ్రయం లోని హెలిక్యాప్టర్‌ నిలుపు స్థలాన్ని ఎస్పీతో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించే డైట్‌ మైదానం, విమానాశ్రయ స్థలాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీటీడీసీలో విశ్రాంతి తీసుకునే గదితో పాటు కార్యక్రమానికి వచ్చే నాయకుల కోసం ఏర్పాటుచేసిన గదులను పరిశీలించారు. ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట పుర అధ్యక్షురాలు రంగినేని మనీష, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఆరె రాజన్న, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌, గ్రంథాలయ ఛైర్మన్‌ రావుత్‌ మనోహర్‌, తెరాస నాయకులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, సాజిదోద్దీన్‌, యూనిస్‌అక్బానీ, తుల శ్రీనివాస్‌, విజ్జగిరి నారాయణ ఖయ్యూం, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు