close

శనివారం, అక్టోబర్ 20, 2018

తాజా వార్తలు

కొత్తగూడెం సబ్‌డివిజన్‌ పరిధిలో రూ.20 కోట్ల బకాయిలు

జూలూరుపాడు, న్యూస్‌టుడే: కొత్తగూడెం సబ్‌డివిజన్‌ పరిధిలో రూ.20 కోట్ల మేర విద్యుత్తు బకాయిలు ఉన్నట్లు ఏడీఈ రహీంహుస్సేన్‌ తెలిపారు. జూలూరుపాడు విద్యుత్తు ఉపకేంద్రం కార్యాలయంలో సోమవారం ఆయన బకాయిల వసూళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి సంబంధించి రూ.1.20 కోట్లు, గృహాలకు రూ.6 కోట్లు, పరిశ్రమలు, పంచాయతీలకు రూ.12 కోట్లు బకాయిలను వసూలు చేయాల్సి ఉందన్నారు. వీటిని వసూళ్లు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి 24 గంటలు నిరంతర విద్యుత్తు సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు లేవన్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. సమావేశంలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు