close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

సర్పంచుల ప్రాంతీయ సమ్మేళనానికి ఆహ్వానం

చింతకాని, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వరంగల్‌ జిల్లా హన్మకొండలో మంగళవారం సర్పంచుల ప్రాంతీయ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనానికి వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సర్పంచులు హాజరుకానున్నారు. ఎనిమిది జిల్లాల నుంచి 800 మంది సర్పంచులు ఈ సమ్మేళనానికి హాజరుకానున్నారు. ఈ సమ్మేళనంలో గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమ్మేళనానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ సభాపతి మధుసుదనాచారి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు, మంత్రి చందూలాల్‌ హాజరుకానున్నారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు సమ్మేళన ప్రారంభ కార్యక్రమం ఉంటుందని సర్పంచులకు ఆహ్వానాలు అందజేశారు. చింతకాని మండలం నుంచి నాగులవంచ సర్పంచి లక్ష్మీనారాయణ, సీతంపేట సర్పంచి ఆళ్ల రవీందర్‌, వందనం సర్పంచి ఆవుల నాగేశ్వరరావు, నాగిలిగొండ సర్పంచి జమ్ముల కృష్ణారెడ్డి, అనంతసాగర్‌ సర్పంచి చల్లా అచ్చయ్య, జగన్నాధపురం సర్పంచి కాశిమాల కనకమహాలక్ష్మీ సమ్మేళనానికి హాజరుకానున్నట్లు ప్రోగ్రాం గైడ్‌ అధికారి రామయ్య పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు