close

సోమవారం, అక్టోబర్ 15, 2018

తాజా వార్తలు

నేడు పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం

ఖమ్మం సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: ప్రజలకు విస్తృత సేవలను అందుబాటులోకి తేవడంలో భాగంగా ఖమ్మంలోని ప్రధాన తపాలా కార్యాలయ ప్రాంగణంలో పాస్‌పోర్డు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఇ.ఎలీశా తెలిపారు. ఈ కేంద్రాన్ని పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారన్నారు. సోమవారం ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుడు ఒక్కసారి పాస్‌పోర్టు కేంద్రానికి వస్తే.. అతనికి సంబంధించిన సమాచారం మొత్తం అప్‌లోడ్‌ చేయడం జరుగుతుందని, ఈ పనినిమిత్తం మరో చోటుకు వెళ్లాల్సిన అవసరమే లేదన్నారు. పాస్‌పోర్టు నేరుగా ఇంటికే వస్తుందని ఎలీశా తెలిపారు రాష్ట్రంలో ఇప్పటికే హన్మకొండ, మహబూబ్‌నగర్‌లో పాస్‌పోర్టు కేంద్రాలు సేవలందిస్తున్నాయని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంతో పాటు ఆదిలాబాద్‌, మెదక్‌, సిద్దిపేట్‌, నల్గొండ ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పోస్టల్‌ సూపరింటెండెంట్‌ టి.ఐసయ్య, పోస్టమాస్టర్‌ వెంకటనారాయణ పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు