close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

28న  జాతీయ సైన్స్‌ దినోత్సవ సంబరాలు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఈ నెల 28న జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండలోని న్యూస్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవ సంబరాలు నిర్వహించనున్నట్లు డీఈవో పి.సరోజినిదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యజమాన్యాల ఉన్నత పాఠశాలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయికి ఎంపికైన సైన్స్‌ ప్రాజెక్టులు, సైన్స్‌ డ్రామాఫెస్టవల్స్‌, ఫోక్‌డాన్స్‌ కార్యక్రమాలలో ఎంపికైన బాల శాస్త్రవేత్తలు, వారి గైడ్‌ టీచర్లు తప్పనిసరిగా వారి ప్రాజెక్టులతో ఈకార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న బాలశాస్త్రవేత్తలకు బహుమతి  ప్రదానంతో సత్కరిస్తామన్నారు. కార్యక్రమానికి ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూలరవిందర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త శ్యాం హాజరవుతారన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు