close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

టాస్క్‌తో ఉద్యోగ అవకాశాలు

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: టాస్క్‌ శిక్షణ ద్వారా విద్యార్థులకు త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. సోమవారం నల్గొండ పరిధిలోని అన్నెపర్తి ఎంజీయూలో గత 25 రోజులుగా నిర్వహిస్తున్న టాస్క్‌శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పుస్తక పఠనం ఎక్కువగా చేసి సంపూర్ణ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. విద్యార్థులు టాస్క్‌లో చేరి ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కోరారు. ప్రతి కళాశాలలో టాస్క్‌ను అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టెక్‌ మహీంద్ర ఫ్రైడ్‌ స్కూల్‌ ప్రతినిథి సుస్మీతరాయ్‌, ఎంజీయూ అధ్యాపకులు అంజిరెడ్డి, శ్రీదేవి, శైలజ, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు