close

శనివారం, అక్టోబర్ 20, 2018

తాజా వార్తలు

నూతన భవనంలోకి జైళ్ల శాఖ డీజీ కార్యాలయం

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ ఉన్నత కార్యాలయం సోమవారం నూతన భవనంలోకి మారింది. సోమవారం ఉదయం డీజీ వీకే సింగ్‌, ఐజీ ఆకుల నర్సింహ, హైదరాబాద్‌ డీఐజీ సైదయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి చంచల్‌గూడలోని పాత డీజీ కార్యాలయం నుంచి నల్గొండ క్రాస్‌ రోడ్డులోని నూతన కార్యాలయంలోకి మారిపోయారు. నల్గొండ క్రాస్‌రోడ్డులో ఉమ్మడి రాష్ట్రంలో జైళ్ల శాఖ ఐజీ అధికార నివాసంగా కొనసాగిన ప్రాంతంలో తెలంగాణ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు.

ఐజీ, డీఐజీ పరిపాలనా కార్యాలయాలు 
నల్గొండ క్రాస్‌రోడ్డులో నిర్మించిన నూతన భవనంలోనే తెలంగాణ ఐజీ, హైదరాబాద్‌ డీఐజీ కార్యాలయం, రాష్ట్ర జైళ్ల శాఖ పరిపాలనా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అధికారుల సమావేశ ప్రాంగణం, వీడియో సమావేశ మందిరాలను విశాలంగా నిర్మించారు. నూతన డీజీ కార్యాలయ ప్రాంగణాన్ని పచ్చదనం ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దారు. పలువురు ల్యాండ్‌స్కేపింగ్‌ నిపుణులు, మాజీ ఉద్యానశాఖ అధికారుల సహాయ సహాకారాలతో పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న చంచల్‌గూడ కార్యాలయంలో జైళ్ల శాఖ శిక్షణ సంస్థను, యాచకుల కోసం నిర్వహిస్తున్న ఆనందాశ్రమాన్ని విస్తరించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు