close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

కేంద్రం ఇచ్చిన నిధులపై    శ్వేత పత్రం విడుదల చేయాలి

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని భాజపా జాతీయ నాయకులు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అవలంభించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని విమర్శించారు. రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ రైతులకు అందించలేదని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీని అవమానించే విధంగా కేసీఆర్‌ విమర్శలు చేయడం తగదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించి ఇవ్వకపోగా.. డబ్బుల కోసం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అనడం సబబుకాదన్నారు.  పశ్చిమబంగలో తమ పార్టీ కార్యకర్తలకు డబ్బులను దోచిపెట్టిన కమ్యూనిస్టుల అడ్రస్‌ను గల్లంతు చేశారని.. అదే గతి కేసీఆర్‌కు పడుతుందని విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, ఆర్‌.శ్రీధర్‌రెడ్డి, వి.సుధాకర్‌శర్మ  పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు