close

మంగళవారం, ఆగస్టు 14, 2018

తాజా వార్తలు

ఆకట్టుకున్న ఆహార్య ఫ్యాషన్‌ షో 

ఆకట్టుకున్న ఆహార్య ఫ్యాషన్‌ షో 

మాదాపూర్‌: ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థుల సృజన సోయగంలో మోడళ్లు మెరిసిపోయారు. యువ డిజైనర్లు రూపొందించిన వస్త్రశ్రేణిలో ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై హొయలొలికించారు. హైటెక్‌సిటీ ఐఎన్‌ఐఎఫ్‌డీ ఫ్యాషన్‌ కళాశాల విద్యార్థుల గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా సోమవారం ‘ఆహార్య 2018’ పేరిట ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ షోలో 32 రకాల వస్త్ర కలెక్షన్లను సుందరీమణులు ప్రదర్శించారు. విభిన్న అంశాల స్పూర్తితో విద్యార్థులు డిజైన్‌ చేసిన దుస్తులు వారి సృజనకు అద్దం పట్టాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు