close

శనివారం, జూన్ 23, 2018

తాజా వార్తలు

వైకల్యం- ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు 

వైకల్యం- ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రపంచంలో వైకల్యం- ఆరోగ్యం అనే అంశంపై సోమవారం బోయిన్‌పల్లిలోని మానసిక వికలాంగుల సాధికారత జాతీయ సంస్థలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. సౌత్‌ ఏషియా సెంటర్‌ ఫర్‌ డిజెబులిటీ ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసర్చ్‌ (ఎస్‌ఏసీడీఐఆర్‌), సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఎట్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీహెచ్‌హెచ్‌) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముప్పై దేశాల ప్రతినిధులతో పాటు 200 మంది ప్రజారోగ్య నిఫుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దివ్యాంగుల శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ విచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం చేపట్టిన పథకాలను వివరించిన ఆయన రెండో సారి హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగడం మంచి పరిణామమన్నారు. అంధత్వ నివారణ, పర్యావరణ ఆరోగ్యం, సుస్థిరాభివృద్ధితో పాటు సమ్మిళిత వృద్ధి, పిల్లల్లో మానసిక వైకల్యం- జాతి బాధ్యత, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై ఐఐపీహెచ్‌హెచ్‌, కేర్‌ నిధి, ఫోరస్‌ హెల్త్‌ సంస్థలకు చెందిన ప్రముఖులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు