close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

కొరమీను చేపల ఉత్పత్తి క్షేత్రంగా కోయిలసాగర్‌ 

కొరమీను చేపల ఉత్పత్తి క్షేత్రంగా కోయిలసాగర్‌ 

కోయిలసాగర్‌ (దేవరకద్ర గ్రామీణం), న్యూస్‌టుడే : కోయిలసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉన్న మత్స్యక్షేత్రాన్ని తెలంగాణ చేపగా గుర్తించిన కొరమీను చేపల క్షేత్రంగా ఎంపిక చేస్తున్నట్లు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌ మత్స్యక్షేత్ర వైద్యులు రాజేశ్వర్‌ తివారీ, రాష్ట్ర మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం కోయిలసాగర్‌ ప్రాజెక్టు వద్ద చేపలను పెంచే నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం కొరమీను చేప రకాన్ని ఉత్పత్తి చేసి సంరక్షణ చర్యలు చేపట్టడంలో భాగంగా తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంగా మార్చబోతున్నట్లు తెలిపారు. కోయిలసాగర్‌ క్షేత్రం అనువుగా ఉండటంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఉత్పత్తికి ఎంపిక చేశారన్నారు. చేపల ఉత్పత్తికి కావల్సిన వసతులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. త్వరలోనే చేపల ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన కేజ్‌కల్చర్‌ పద్ధతిలో చేపలను ఉత్పత్తి చేసే విధానాన్ని అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యసహాయ సంచాలకులు ఖదీర్‌ హమ్మద్‌, మత్స్యఅభివృద్ధి అధికారి మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు