close

మంగళవారం, ఆగస్టు 14, 2018

తాజా వార్తలు

క్రీడా కార్యాలయంలో కాగిత రహిత సేవలు 

క్రీడా కార్యాలయంలో కాగిత రహిత సేవలు 

మహబూబ్‌నగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే : జిల్లా యువజన క్రీడాభివృద్ధి కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ కాగిత రహిత సేవలను ప్రారంభించారు. ఇకనుంచి కాగిత రహితపాలన సాగించాలని, అన్ని దస్త్రాలను ఆన్‌లైన్‌ ఈ- కార్యాలయం ద్వారానే అమలు చేయాలని సూచించారు. డీవైఎస్‌వో టీవీఎల్‌ సత్యవాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని డీవైఎస్‌వో కార్యాలయాల్లో తొలి ఈ-కార్యాలయ పాలన మహబూబ్‌నగర్‌లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఈఎండీ మేనేజరు వాసుదేవరావు, డీవైఎస్‌ఏ కార్యాలయ సిబ్బంది, శిక్షకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు