close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

గురుకులాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి 

గురుకులాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి 

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : గురుకుల విద్యాలయాల్లో వందకు వందశాతం సత్ఫలితాలు సాధించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర అధికారులతో కలిసి ఉమ్మడి జిల్లాలోని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో దూరదృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గురుకుల విద్యాలయాల్లో అమలవుతున్న సమయసారిణి పట్టికతోపాటు విద్యార్థులకు అందుతున్న కనీస వసతులు, తరగతి గది పాఠ్యాంశాలు, క్రీడలు తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్న గురుకుల విద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రాత్రి సమయాల్లో కచ్చితంగా విద్యాలయాల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు సీహెచ్‌.మల్లికార్జున్‌, సత్యనారాయణ, హుసేనప్ప, డా.వనజ, గురుకుల డిగ్రీ కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు