close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

వైభవంగా సీతారాముల కల్యాణం

వైభవంగా సీతారాముల కల్యాణం

బీచుపల్లి (ఇటిక్యాల), న్యూస్‌టుడే : పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లిలోని కోదండ రామాలయంలో సోమవారం సీతారాముల కల్యాణం కమనీయంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకొని కల్యాణోత్సవం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల సమక్షంలో, భాజా భజంత్రీల మధ్య అర్చకులు నర్సింహమూర్తి  కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు, సిబ్బంది బీచుపల్లి  తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు