close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

రైల్వేస్టేషన్‌లో కొత్తగా 8 సీసీ కెమెరాలు

రైల్వేస్టేషన్‌ (శివనగర్‌), న్యూస్‌టుడే: వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో భద్రత చర్యలు మరింత కట్టుదిట్టం కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న 8 సీసీ కెమెరాలకు తోడు కొత్తగా మరో 8 కెమెరాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే కెమెరాలు స్టేషన్‌కు రాగా ప్రస్తుతం వాటిని బిగించే పనులు చేపట్టారు. ఇప్పటివరకు కెమెరా దృష్టిలేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించారు. కొత్తగా వచ్చిన కెమెరాలను మూడో నంబరు ప్లాట్‌ఫాంపై అటు చివర, ఇటు చివర రెండువైపులా దృశ్యాలను రికార్డు చేసేలా చర్యలు తీసుకున్నారు. స్టేషన్‌ ఆవరణలో, ప్లాట్‌ఫాం నుంచి బయటికి వెళ్లే ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రోజుల్లో కెమెరాలను అమర్చడం పూర్తిచేసి పనిచేసేలా చూస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు