close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

వరంగల్‌ నాటకానికి జాతీయ స్థాయి అవార్డులు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అభినవ ఆర్ట్స్‌ హనుమ అవార్డ్స్‌ వారు నిర్వహించిన జాతీయ స్థాయి పౌరాణిక పద్యనాటక పోటీలలో వరంగల్‌ కళాకారులు ప్రతిభ చాటారు. వరంగల్‌ నగరంలోని శ్రీసాయి సంతోషి నాట్యమండలి (సురభి) కళాకారులు ఈనెల 24న ప్రదర్శించిన ‘కలియుగ వైకంఠం’ అనే నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. నాటకంలో శ్రీనివాసుడి పాత్ర పోషించిన దేవర్రాజు రవీందర్‌రావుకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకత్వానికి కొండల్‌రావుకు, ఉత్తమ అలంకరణకు సురభి సంతోష్‌కు, ఉత్తమ అహార్యానికి శ్రీనివాస్‌కు బహుమతులు వచ్చాయని తెలంగాణ డ్రమెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆకుల సదానందం ప్రకటనలో తెలిపారు. నాటక ప్రదర్శనకు వచ్చిన బహుమతులను సోమవారం కళాకారులకు అందించినట్లు సదానందం తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు