close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

తల్లిదండ్రులకు బాలిక అప్పగింత

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు తనపై కోపం చేసుకున్నారని ఆవేదనతో ఓ బాలిక ఇంటినుంచి పారిపోయి వెళ్తుండగా మార్గమధ్యంలో పట్టణానికి చెందిన ఓ అనాథాశ్రమ నిర్వాహకులు ఆ బాలికను తిరిగి అప్పగించిన సంఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక వర్ధన్‌ ఆశ్రమ నిర్వాహకులతో పాటు ఐసీడీఎస్‌ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని వర్ధన్‌ అనాధాశ్రమ నిర్వాహకులు రవీందర్‌, లక్ష్మీలు వరంగల్‌ రహదారిలో జనగామకు కారులో వస్తుండగా, నిడిగొండ-యశ్వంతాపూర్‌ వద్ద ఓ బాలిక ఒంటిరిగా రహదారిపై వెళ్తూ కన్పించింది. వెంటనే వారు దిగి బాలికను వివరాలు అడిగారు. తన పేరు రోషాబి అని, తాను చౌడారం గ్రామస్థురాలినని చెప్పింది. తల్లిదండ్రులు తనను అకారణంగా తిట్టారని, అందుకే ఇంటి నుంచి వచ్చానని తెలిపింది. వెంటనే వారు ఆ బాలికను పట్టణంలోని తమ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్‌, పోలీస్‌ అధికారులతో పాటు చౌడారం గ్రామ సర్పంచి కొమురయ్య, బాలిక తల్లిదండ్రులు ఇమామ్‌, మదార్‌లకు తెలిపారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులను కార్యాలయానికి పిలిపించి డీడబ్ల్యూవో పద్మజారమణ, ఏసీడీపీవో ప్రేమలత తదితరులు కౌన్సెలింగ్‌ నిర్వహించి బాలికను సర్పంచి కొమురయ్య సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు