close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

మోహినీ అలంకారంలో మహిమాన్వితుడు 

అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణ), న్యూస్‌టుడే : అహోబిలంలో బ్రహ్మోత్సవాలు కనులవిందుగా సాగుతున్నాయి. లక్ష్మీనృసింహ స్వామి పలు వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దిగువ అహోబిలంలో శ్రీప్రహ్లాదవరద స్వామి మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. మోహినీ అలంకృతుడైన స్వామి పల్లకిపై కొలువుదీరి ఆలయ పురవీధుల్లో  ఊరేగుతూ మఠానికి చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి స్వామి మేళతాళాల నడుమ ఊరేగింపుగా 2 కి.మీ దూరంలో ఉన్న ఛత్రవట నృసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లి విశేష ఆరాధనలు చేశారు. భక్తుల కోరిక మేరకు ఇళ్ల చెంత స్వామిని కొలువుదీర్చారు. ఈ క్రమంలో నంబిళ్లై అనే స్వామి సేవకుడి ఇంటి వద్ద కొలువుదీర్చి పూజలు నిర్వహిస్తుండగా రెండు గద్దలు ఆకాశంలో అక్కడక్కడే విహరించాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు గరుత్మంతుడే స్వామి సేవకు హాజరయ్యారని తన్మయానికి లోనయ్యారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. రాత్రి విశేష అలంకరణలో ప్రహ్లాదవరద స్వామి శరభవాహనంపై విహరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు