close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

మహానందీశుడి సేవలో బుల్లితెర నటుడు

మహానంది, న్యూసుటుడే: చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో అవకాశం రావడం నా జన్మకు సార్థకత ఏర్పడినట్లేనని బుల్లితెర హాస్యనటుడు (జబర్థస్త్‌ కట్టప్ప), పార్థు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మహానంది పుణ్యక్షేత్రానికి దర్శనార్థం వచ్చారు. శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి పూజలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా, సినిమాల్లో నటించాలన్న తలంపుతో వైజాగ్‌ నుంచి వెళ్లిపోయినందుకు ఇన్నేళ్ల తర్వాత ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ-టీవీలో వస్తున్న జబర్థస్త్‌ కార్యక్రమాలల్లో పాల్గొనడానికి షకలక శంకర్‌ ద్వారా మంచి అవకాశాలు వచ్చాయన్నారు. దేవస్థానం వారు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు