close

శనివారం, సెప్టెంబర్ 22, 2018

తాజా వార్తలు

ఆర్థిక నగరంగా రాగమయూరి 

ఆర్థిక నగరంగా రాగమయూరి 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో జరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు-2018లో రాగమయూరి ఆర్థిక నగరం (ఎకానమిక్‌ సిటి) ఏర్పాటుపై ఎంవోయూ కుదిరింది.  జిల్లాలో బి.తాండ్రపాడు, కల్లూరు మండలం తడకనపల్లె గ్రామాల పరిధిలో 182 ఎకరాల్లో రూ.1667 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాగమయూరి ఎకానమిక్‌ సంస్థ వ్యవస్థాపకులు కేజీ రెడ్డిలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 49 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు, మిగిలిన భూమిలో హౌసింగ్‌ సెక్టార్‌ కింద 8670 ఇళ్లు నిర్మించేందుకు, సర్వీస్‌ సెక్టార్‌ కింద ఆసుపత్రి, పాఠశాల, కన్వెన్షన్‌ హాల్‌ తదితర వాటిని నిర్మించనున్నారు. పీఎంఏవై పథకం కింద ఇళ్లు నిర్మించనున్నారు.  జిల్లాలో రాగమయూరి ఆర్థిక నగరంతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరు ఎస్‌.సత్యనారాయణ జిల్లాపరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపారు. ఎంఎస్‌ఎంఈ పార్కులు, పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంతోపాటు అనుమతులు త్వరితగతిన ఇప్పించి పరిశ్రమలను సత్వరమే ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టరు హామీ ఇచ్చారు.

జిల్లా వార్తలు