close

శుక్రవారం, నవంబర్ 16, 2018

తాజా వార్తలు

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తా 

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తా 
ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ 

కనిగిరి, న్యూస్‌టుడే: తాము అధికారంలోకి రాగానే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో ఆదివారం ఆయన కనిగిరి నగర పంచాయతీలోని టకారిపాలెం, దేవాంగ్‌నగర్‌, కాశిరెడ్డినగర్‌ కనిగిరి మండలంలోని చల్లగిరిగల, నందనమారెళ్ల, యడవల్లి కూడలి వరకు 9 కిలోమీటర్ల మేర నడిచారు. అనంతరం కొనకనమిట్ల మండలంలోని అడుగు పెట్టారు. ఆయా గ్రామాల కూడళ్లలో మహిళలు, వృద్ధులు వికలాంగులు జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. చల్లగిరగల వద్ద కొందరు మహిళలు ప్రభుత్వం పరంగా ఎలాంటి పథకాలు అందడంలేదని తెలిపారు. నందనమారెళ్ల, యడవల్లి కూడలి వద్ద చెరకు, పొగాకు రైతులు, వికలాంగుల హక్కులవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రనాయకులు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో వికలాంగులు జగన్‌ను కలిశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని ఇపుడా పరిస్థితి లేదని జగన్‌ విమర్శించారు. నందనమారెళ్ల, యడవల్లివద్ద నిరుద్యోగ యువకులు కలసి వినతిపత్రం అందజేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కరిస్తానని జగన్‌ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంఎం కొండయ్య యాదవ్‌, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి సోదరుడు ముక్కు జయరామిరెడ్డిలు జగన్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ యాత్రంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ బాధ్యుడు బుర్రా మధుసూదన్‌యాదవ్‌, పార్టీ నాయకులు వైఎం ప్రసాద్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు, షేక్‌ బుజ్జి, బొల్లా మాల్యాద్రి చౌదరి, మడతల కస్తూరి రెడ్డి, సిద్దారెడ్డి, పెన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం నియోజకవర్గానికి చేరిన యాత్ర 
పొదిలి, కొనకనమిట్ల: జగన్‌ పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మార్కాపురం నియోజకవర్గం... కొనకనమిట్ల మండలంలోని పెదారికట్లకు చేరింది. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసులరెడ్డి, కె.పి.కొండారెడ్డి, పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, కె.వి.రమణారెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానిక మహిళలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పెదారికట్ల దాటాక సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌... యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయనకు స్వాగతం పలికారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన దర్జీలు తమ సమస్యలను జగన్‌కు వివరించారు. సాయంత్రం 5.20 గంటలకు చినారికట్ల శివారు బత్తాయి తోటలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. కొనకనమిట్ల జడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, మండల కన్వీనర్‌ వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ ఉడుముల రాంనారాయణరెడ్డి, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.