close

శనివారం, నవంబర్ 17, 2018

తాజా వార్తలు

సామాజిక మాధ్యమాలతో మరింత ముందుకు...

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా వలంటీర్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక నెహ్రూబజార్‌లోని జీవీఎన్‌ ఫంక్షన్‌హాలులో ఆదివారం తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా వలంటీర్ల నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల ప్రబావం ప్రజలపై ఎక్కువగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి కార్యక్రమాన్ని ఆయా మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వాటిని ఉపయోగించే పద్ధతులను కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా గెలుపే లక్ష్యంగా ప్రతి వలంటీర్‌ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ సోషల్‌ మీడియా జిల్లా ఇన్‌ఛార్జి సింగు రాజానరసింహారావు, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు బాబు, నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్‌, కాటూరి పెదబాబు, కనిగిరి బాలవెంకటరమణ, తాళ్లపల్లి సత్యనారాయణ, షేక్‌ ఆదాంసాహెబ్‌, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జనార్దన్‌, వలంటీర్లు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.