close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

జాతీయ సదస్సుకు సింగరాయకొండ సర్పంచి

 

సింగరాయకొండ, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్‌ పరిపాలనపై సోమ, మంగళవారాల్లో హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సుకు సింగరాయకొండ సర్పంచి కుంభా నాగమణిని అధికారులు ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 10 మంది సభ్యులు సదస్సుకు హాజరుకానున్నారు. ప్రకాశం జిల్లా నుంచి సింగరాయకొండ సర్పంచిని ఆహ్వానిస్తూ జిల్లా పంచాయతీ అధికారి నుంచి అధికారిక ఉత్తర్వులు అందాయని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు