close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

శ్రవణ మనోహరం.. కవలల గళ మాధుర్యం

 

ఒంగోలు సాంస్కృతిక విభాగం, న్యూస్‌టుడే: త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ఒంగోలు కోర్టు సెంటర్‌ త్యాగరాజ మందిరంలో చెన్నైకి చెందిన కవల సోదరీమణులు అర్చన-ఆరతిల కర్ణాటక సంగీత విభావరి శ్రోతలను తన్మయులను చేసింది. తమ గళ మాధుర్యానికి తోడు, కీర్తనల్లోని ధార్మిక మార్మికతను ఆలాపనల్లో పలికించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మందిర మేనేజింగ్‌ ట్రస్టి పాంచాలవరపు రామచంద్రమూర్తి మాట్లాడుతూ మన ప్రాంతానికి చెందిన త్యాగరాజ స్వామి సంగీతానికి చేసిన కృషి అనన్యమని అన్నారు. దానిని మనం ఇంటింటికీ తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. బాల్యం నుంచే చిన్నారులను తెలుగు సంప్రదాయ సంగీతం, నృత్యం తదితరాల వైపు మళ్లించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పప్పు జ్ఞాన దేవ్‌ వాయిలీనంతో, అనంత పద్మ నాభన్‌ అక్షయ్‌ అనంత పద్మనాభన్‌ మృదంగంతో సహకరించారు. జ్ఞాన సింధు ధార్మిక మండలి ప్రతినిధులు సహాయకులుగా, గణపతిరాజు అయ్యపరాజు, చిత్రలేఖ, వినితా, కృష్ణమూర్తి దంపతులు కార్యక్రమ సమర్పకులుగా వ్యవహరించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు