close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

మైనార్టీల ఐక్యతతో రాజకీయ పార్టీల కళ్లు తెరిపిస్తాం 

మైనార్టీల ఐక్యతతో రాజకీయ పార్టీల కళ్లు తెరిపిస్తాం 

రాయచోటి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మైనార్టీలు ఐక్యతను చాటి రాజకీయ పార్టీల కళ్లు తెరిపిస్తామని హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో మైనార్టీల ప్రాబల్యాన్ని పార్టీలు సక్రమంగా గుర్తించడం లేదన్నారు. మైనార్టీలలో నెలకున్న పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్రంలోని మైనార్టీ సోదరులు కలిసికట్టుగా పోరాటం సాగించాల్సిన తరుణం వచ్చిందన్నారు. సీమాంధ్రలో మైనార్టీల ప్రాభల్యం ఉన్న ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాలలను కూడా ప్రభావితం చేయగలిగిన సామాజివర్గం కేవలం మైనార్టీలేనన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని చెప్పారు. రాయలసీమలో సుమారు 20 లక్షల మంది పైబడి ముస్లిం మైనార్టీల జనాభా ఉందన్నారు. 14 శాతం పైబడిన మైనార్టీ వర్గానికి ఏ పార్టీ సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో తొలుత మైనార్టీ వర్గాల పేదరిక నిర్మూలనతో పాటు విద్యా అవకాశాలను అందిపుచ్చుకుని మైనార్టీ యువత ఉన్నత స్థితికి చేరేందుకు దోహదపడతామన్నారు. రాజకీయాలకు అతీతంగా సీమ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ ఐక్యవేదికలు ఏర్పాటు చేస్తున్నారని ఇది ఎంతో శుభ పరిణామంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే రాయలసీమలోని అనంతపురం, కదిరి, మదనపల్లి, కడప ప్రాంతాలలో ఈ వేదికలు విజయవంతంగా నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలకు ఏ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కేటాయిస్తాదో ఆ పార్టీకి మైనార్టీల మద్దతు ఉంటుందన్నారు. ఈ ఐక్యవేదికలు అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఖలీల్‌బాషా పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీ సంక్షేమానికి కృషి చేశామన్నారు. రాబోయే రోజుల్లో మైనార్టీ సోదరులకు అండగా నిలుస్తామన్నారు. విద్యా, రాజకీయ పరంగా మైనార్టీలు ముందడుగు వేయాలని విశ్రాంత న్యాయమూర్తి ఇంతియాజ్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో గెలుపు ఓటములను నిర్ణయించగల శక్తి మైనార్టీలకు ఉందని రాయచోటికి చెందిన దస్త్రావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు రియాజుద్దీన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎంపీ స్థానాలు, 12 ఎమ్మెల్యే స్థానాలను మైనార్టీలకు రాజకీయ పార్టీలు కేటాయించేలా పోరాడతామని అనంతపురం మాజీ జడ్పీ ఛైర్మన్‌ చమన్‌ పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారని వారికి తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని కోఆప్షన్‌ సభ్యుడు సలావుద్దీన్‌ పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా పేదలను ఆదుకోవాలని జామియా మసీదు కమిటీ ఛైర్మన్‌ డాక్టరు హుస్సేనీ పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించుకునేందుకు అందరు కలిసి కట్టుగా పోరాడాలని కోరారు. ఇలాంటి వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించి అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. సమావేశంలో కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ముస్లిం మైనార్టీ ప్రతినిధులు, స్థానిక మైనారీ నాయకులు విశ్రాంత ఎస్‌ఈ ఫజుల్‌ఇలాహీ, కె.అలీనవాజ్‌ఖాన్‌, యూసూఫ్‌ఖాన్‌, బషీర్‌ఖాన్‌, ఇర్షాద్‌అహమ్మద్‌, జమాల్‌, జాఫర్‌అలీఖాన్‌ ఇతరమైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు