close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు మేలు

 

నెల్లూరు(వైద్యం),న్యూస్‌టుడే : నెల్లూరులోనే క్యాన్సర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ క్యాన్సర్‌ ఆసుపత్రి సాధన కమిటీ నాయకులు ఆదివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ చాట్ల నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ కమిటీ కన్వీనర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ దత్తాత్రేయులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటుకు రూ.45 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో ఇక్కడ క్యాన్సర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరుతో పాటు, చిత్తూరు, కడప, ఒంగోలు ప్రాంతాల ప్రజలకు దోహదపడుతుందన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే జిల్లా మంత్రులను, ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసి విన్నవించామన్నారు.క్యాన్సర్‌ ఆసుపత్రి సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్‌ ఎంవీ రమణయ్య, డాక్టర్‌ శ్రీనునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు