close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పుల్లంపేట, న్యూస్‌టుడే: ఎస్‌బీవీడీ సభా ఉన్నత పాఠశాల తరగతి గదుల జీర్ణోద్ధరణకు నిధులు సమకూరుస్తామని పూర్వ విద్యార్థి ప్రముఖ వైద్యులు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్‌బీవీడీ సభా సంస్థలో 1969 బ్యాచ్‌ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అప్పటి విద్యార్థులు హాజరై వారి జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మాతృ పాఠశాల అభివృద్ధి కోసం అందరం తమ వంతుగా సహాయం చేసి పాడైపోయిన గదులను పునరుద్ధరించాలని నిర్ణయించుకొన్నట్లు తెలిపారు. పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌ కమిటీ ఎంపికను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడుగా ఓబులేసు, ఉపాధ్యక్షుడుగా రంగనాథ్‌జీ, కార్యదర్శి సుబ్బరాయుడు, సంయుక్త కార్యదర్శిగా శివప్రసాద్‌, వెంకట్రామయ్య, ట్రెజరర్‌గా డా.శంకరయ్యను ఎన్నకొన్నట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు