close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

ఘనంగా వృషభాచలేశ్వరుని జోర్ణద్ధరణ ఉత్సవాలు 

ఘనంగా వృషభాచలేశ్వరుని జోర్ణద్ధరణ ఉత్సవాలు 

వేంపల్లె, న్యూస్‌టుడే : స్థానిక పాపఘ్ని నది తీరాన ఎద్దులకొండపై వెలసిన వృషభాచలేశ్వరస్వామి జీర్ణోద్ధరణ ఉత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులు ప్రతాప్‌, శ్రీనివాసన్‌, వేంపల్లె అర్చకుడు హరిప్రవీణ్‌ నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  వీరన్నగట్టుపల్లె, ఇడుపులపాయ ఉపాధ్యాయినులు భరతలక్ష్మి, గిరిజాకుమారి తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని భక్తుల సాయంతో ఆరోహణ నిర్వహించారు. ఈసందర్భంగా కొండపైకి వెళ్లే భక్తుల కోసం ఆలయ కమిటీ, అధికారులు వేంపల్లె నుంచి ప్రత్యేక వాహనాలు నడిపారు. అనంతరం వేంపల్లె ఉషాకిరణ్‌, నారాయణ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఎద్దులకొండ్రాయుడు, ఈవో ప్రతాప్‌, పాలకమండలి సభ్యులు తిప్పారెడ్డి, గాలిహరిప్రసాద్‌, రామాంజనేయులు, రాములమ్మ, నాగలక్ష్మి, వెంకటసుబ్బయ్య, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రతినిధి సింగనమల సాంబశివుడు, ఆలయ అధికారులు రంగప్రసాద్‌, శ్రీనివాసులు, భాస్కర్‌, ఉషాకిరణ్‌, నారాయణ ఉన్నత పాఠశాలల కరస్పాండెంట్లు బీ.ఎస్‌.రమణారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు