close

శనివారం, సెప్టెంబర్ 22, 2018

తాజా వార్తలు

హోలీలో రసాయన రంగులొద్దు 

3కె రన్‌లో బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌టుడే: హోలీ పండుగను అందరూ ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని, రసాయన రంగులు వాడొద్దని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం శ్రీకరం ఈవెంట్స్‌ హైదరాబాద్‌ అధినేతలు శ్రీనిధి, కిరణ్‌ ఆధ్వర్యంలో ప్రీ హోలీ- 3కె రన్‌ నిర్వహించారు. దీన్ని స్థానిక వీఆర్‌ కళాశాల మైదానంలో బీద, కోటంరెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాలీ వీఆర్‌ మైదానం నుంచి సోమశేఖరపురం, ఎస్‌-2 థియేటర్స్‌, విజయమహాల్‌గేటు, కొత్తహాలు, గాంధీబొమ్మ, పొగతోట మీదుగా తిరిగి వీఆర్‌ మైదానానికి చేరుకుంది. ఈ రన్‌లో విద్యార్థులు, వీఆర్‌ వాకర్స్‌ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాకర్స్‌ని ఉత్సాహ పరిచేందుకు నిర్వాహకులు డీజే మ్యూజిక్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హోలీ పండుగను దేశ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకుంటారన్నారు. హోలీలో ఉపయోగించే రంగులు పర్యావరణానికి ముప్పులేకుండా, చర్మ వ్యాధులు, ఇబ్బందులు రాకుండా ఉన్న రంగులను వాడాలన్నారు. రంగులు విక్రయించేవారు రసాయనాలు లేని రంగులనే విక్రయించాలని బీద, కోటంరెడ్డి కోరారు. అనంతరం అందరూ కలిసి ప్రీ హోలీ వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ ఎస్పీ నీలకంఠరెడ్డి, శుభమస్తు వాసు, ఫన్‌ పార్కు నిర్వాహకులు, వాకర్స్‌ అసోసియేషన్‌ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, విద్యార్థులు, వీఆర్సీ వాకర్స్‌ పాల్గొన్నారు.

జిల్లా వార్తలు