close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఫత్తేఖాన్‌పేట, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకురాలు ఐ.వేమేశ్వరి డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆఫీస్‌ బేరర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనీస వేతనం రూ.18వేలు ఇచ్చిన రోజున తాము బయోమెట్రిక్‌ను స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న జీతాలు, టీఏ బిల్లులు, కూరగాయలు, గ్యాస్‌ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హైమావతి, వై.సుజాతమ్మ, కోశాధికారి రాజేశ్వరమ్మ, స్వరూపారాణి, శ్యామల, పద్మలీల, ప్రభావతమ్మ, హెప్సిబా, శేషమ్మ, వసుంధర, మంజుల పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు