close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

సంగీత మాధుర్యంలో పులకింత 

కంచుకాగడా శ్రీనివాసరెడ్డి జీవిత్య సాఫల్య పురస్కారాల ప్రదానం 

సంగీత మాధుర్యంలో పులకింత 

సాంస్కృతికం, న్యూస్‌టుడే: సుమధుర సంగీత మాధుర్యంలో పురమందిరం పులకించింది.. సమ్మోహన గీతాలను అద్భుతంగా ఆలపించిన  పాడుతాతీయగా గాయని అత్తలూరి ప్రవస్తి తన్మయత్వంలో ఓలలాడించింది. టౌన్‌హాల్‌లో ఆదివారం రాత్రి కంచుకాగడా శ్రీనివాసులురెడ్డి జీవితసాఫ్యల పురస్కార ప్రదాన వేడుకల్లో సంగీత విభావరి జరిగింది. ఈ సందర్భంగా ప్రవస్తి పలు గీతాలను ఆలపించి సంగీతాభిమానులను  ఆకట్టుకున్నారు. అనంతరం గాయని ప్రవస్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎ.జయప్రకాష్‌కు  గళం పక్షపత్రిక పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కళాసంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, నగర డీఎస్పీ మురళీకృష్ణ, పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గళం రవీంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి టీవీ నటుడు దోర్నాల హరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు