close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

విద్యార్థీ..విజయోస్తు! 

అన్నవరం, న్యూస్‌టుడే: పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా సరస్వతీ దేవి కటాక్షం అందించేందుకు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సరస్వతీ పూజ నిర్వహించారు. నిత్యకల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరై భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించారు. ఈవో జితేంద్ర జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల ఉత్సవమూర్తుల చెంతనే సరస్వతీ దేవి విగ్రహాన్ని ఉంచి సుందరంగా అలంకరణ చేసి ప్రధానార్చకులు గాడేపల్లి వెంకట్రావు, పండితులు ముష్టి కామశాస్త్రి, పురోహితులు ముత్య సత్యనారాయణల ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ మొదలుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజలో పాల్గొన్న విద్యార్థులందరికీ పూజ చేసిన పెన్ను, స్వామివారి చిత్రాన్ని ఈవో, అధికారుల చేతుల మీదుగా అందించారు. అందరికీ పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఈవో మాట్లాడుతూ రానున్న పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు