close

శనివారం, నవంబర్ 17, 2018

తాజా వార్తలు

ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి 

నియోజకవర్గ బాధ్యులకు చినరాజప్ప సూచన 

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు.  కాకినాడ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం తెదేపా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి చినరాజప్పతోపాటు ఎంపీలు మాగంటి మురళీమోహన్‌, తోట నరసింహం, పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ప్రజల ఆదరణ, ఆశీస్సుల వల్లే తెదేపా అధికారంలోకి రాగలిగిందన్నారు. పనిచేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని ప్రజలు మరచిపోరని చినరాజప్ప అన్నారు. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పార్టీ ఆదేశాల మేరకు ఏరియా కోఆర్డినేటర్ల నియామకాన్ని పూర్తిచేయాలని సూచించారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీల సమావేశాలు క్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ ఇకనుంచి ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరిగా తమ వ్యక్తిగత పనితీరు నివేదికలను వచ్చేనెల నుంచి అధిష్టానానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అనంతరం పలు అంశాలపై నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలతో చినరాజప్ప సమీక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్‌.రామకృష్ణారెడ్డి, పి.నారాయణమూర్తి, వేగుళ్ల జోగేశ్వరరావు, వనమాడి వెంకటేశ్వరరావు, వంతల రాజేశ్వరి, జడ్పీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌, వైఎస్‌ ఛైర్మన్‌ పెండ్యాల నళినీకాంత్‌, గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, శీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్‌, తదితరులు 

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.