close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

పాట వింటే.. స్ఫూర్తి నింపాలి 

అప్పుడే సాహిత్యం వికసిస్తుంది 
సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ 

పాట వింటే.. స్ఫూర్తి నింపాలి 

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రేక్షకుడిలో స్ఫూర్తిని నింపే పాటలను అందించినప్పుడే సాహిత్యం మరింత వికసిస్తుందని ప్రముఖ సినీగేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్‌ తెలిపారు. అమలాపురం గ్రామీణం కామనగరువులోని ఆదిత్య పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తన మదిలోని భావాలను పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

చదువును వదులుకోలేదు 
రచయితగా అవకాశాల కోసం వెతుకులాటలో చదువును వదులుకోలేదు. చదువుకు ముందే కొన్ని పాటలు రాసి పెట్టుకున్నా. ఆ తరువాత బీటెక్‌ మధ్యలో ఆపేశాక రచయితగా ఉండాలని చిత్రరంగంలో స్థిరపడ్డా. ‘సంగమం’ చిత్రంలోని పూతవేసిన లేతమామిడి అనే పాటతో నా ప్రస్థానం ప్రారంభించా. అప్పట్లో మా నాన్న మిత్ర బృందం సాహిత్య సాధన చేసేవారు. అపుడే సాహితీ పరిమళాలు నాలో ప్రసరించాయి.

సహకారం మరువలేనది 
వినోదం, సంతోషం ఇవ్వగలిగినప్పుడే ప్రతి పాట శ్రోతల మనసును రంజింపజేస్తుంది. రచయితగా కాదంటే అవుననిలే చిత్రంలోని పాట ద్వారా వెండి తెరకు పరిచయమయ్యా. ఇప్పటికి రచయితగా 950 పాటలను అందించగలిగా. సినీరంగంలో విశ్వనాథ సత్యనారాయణ రచయితగా నన్ను ఓ మెట్టు ఎక్కేందుకు నిలబెడితే.. చిరంజీవి గారు మాత్రం అవకాశాన్ని అందించారు. కీరవాణి ప్రోత్సాహం.. దిల్‌ రాజు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేను.

జీవితాశయం ఆయనే నెరవేర్చారు 
నా జీవితంలో ఎన్ని పాటలను శ్రోతలకు వినసొంపుగా అందించినా.. ఇంకా ఎక్కడో వెలితి కనిపించేది. అది గౌతమ్‌ మీనన్‌తో నెరవేరింది. జీవితంలో ఎ.ఆర్‌.రెహ్మాన్‌ చిత్రానికి పాటలను రాయగలనా లేదా అని ఆలోచించేవాడిని. కానీ ఏ మాయ చేశావే చిత్రంతో ఆ వెలితి పోయింది. కోనసీమకు వస్తే ఓ నందనవనంలా అనుభూతి కలుగుతుంది. మాది పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామం. కోనసీమ అందాలు వర్ణించడం కొత్తేమి కాదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు