close

శుక్రవారం, నవంబర్ 16, 2018

తాజా వార్తలు

జనం నుంచి పుట్టుకొచ్చిందే జానపదం 

వీవీమెరక(సఖినేటిపల్లి): జనం నుంచి పుట్టుకొచ్చిన పదమే జానపదమని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తెలిపారు.సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో తెలుగు రక్షణ వేదిక, శ్రీశ్రీకళావేదిక, తానా బుక్‌ఆఫ్‌ రికార్డు ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన 125 మంది కళాకారులకు ఆదివారం ‘కళాపురస్కారం’ అందించారు.ఈ సందర్భంగా సర్పంచి చొప్పల విజయకుమారి అధ్యక్షతన జరిగిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రసార మాధ్యమాలు అందుబాటులో లేని కాలంలో పూర్వీకులు సమయానుకూలంగా కొన్ని పదాలను కూర్చి పాటలుగా పాడేవారని తెలిపారు. పంట పొలాలు,ఇతర చోట్ల పనిచేసే కార్మికులు ఈ పాటలను ఆలపిస్తూ అలసట తెలియకుండా ఉపశమనం పొందేవారన్నారు. ఆధునిక కాలంలో కూడా జానపద గేయాలకు మంచి ఆదరణ ఉందని చెప్పారు. ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావులాంటివారు ఈ గేయాలకు జీవం పోస్తూ అలరిస్తున్నారని అభినందించారు.ఈ గేయాలు ఎప్పుడూ ప్రజలనోళ్లలో నానుతూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.అనంతరం వంగపండు బృందం వేదికపై నృత్యం చేస్తూ ఆలపించిన జానపద గేయాలు అలరించాయి. ఇంతమంది కళాకారులను ఒక వేదికమీదకు తీసుకొచ్చి వారికి పురస్కారాలు అందించిన ఉగాది పురస్కార గ్రహీత డాక్డర్‌ కత్తిమండ ప్రతాప్‌ అభినందనీయుడన్నారు.ఇలాంటి కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వంగపండు తెలిపారు.ముందుగా జరిగిన కవి సమ్మేళనంలో కొంతమంది కవులు తమ కవితలను చదివి వినిపించారు.ఎంపీపీ పప్పుల లక్ష్మీసరస్వతి, జడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గాఅలేంద్రమణి, ఎంపీడీవో త్రిశూలపాణి, తహసీల్దారు సుధాకర్‌రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.