close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ పనుల పరిశీలన 

గుజరాతీపేట (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నగరంలోని జిల్లాపరిషత్తు కార్యాలయం వద్ద రూ. రెండు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇండోర్‌ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ పనులపై తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (ప్రాజెక్ట్స్‌) వి.విజయలలిత పరిశీలించారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆమె సబ్‌స్టేషన్‌లో  జరుగుతున్న విద్యుత్తు ప్యానళ్ల అమరిక తదితర పనులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఏడీఈ యోగేశ్వరరావును ఆదేశించారు. 

ప్రమాదాల నివారణకే ఇన్సులేటెడ్‌ కేబుల్‌ శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న విద్యుత్తు ఇన్సులేటెడ్‌ కేబుల్‌ పనులు పూర్తయితే ప్రమాదాలను నివారించవచ్చని విజయలలిత అన్నారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో విద్యుత్తు స్తంభాలకు కొత్తగా ఇన్సులేటెడ్‌ కేబుల్‌ ఏర్పాటు పనులను ఆమె పర్యవేక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏడీఈకి సూచించారు. ఆమెతో పాటు పలువురు విదుత్తు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు