close

శనివారం, సెప్టెంబర్ 22, 2018

తాజా వార్తలు

గురజాడ విద్యాసంస్థల అధినేత మాతృమూర్తికి నివాళి 


కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు మాతృమూర్తి గుండ్రెడి గౌరమ్మకు కేంద్ర ఎన్నికల సంఘ మాజీ సలహాదారు కె.జె.రావు నివాళులర్పించారు. ఆదివారం విశాఖ-ఏ కాలనీలోని స్వామినాయుడు నివాసంలో గౌరమ్మ పెద్దకర్మ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, అగ్నిమాపక శాఖ ఐజీ కె.సత్యనారాయణ, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రామ్‌జీ, రిజిస్ట్రార్‌ గుంట తులసీరావు, గురజాడ విద్యాసంస్థల కరెస్పాండెంట్‌ అంబటి రంగారావు, గాయత్రీ కాలేజ్‌ ఆప్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ డా.పులఖండం శ్రీనివాసరావు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు.

జిల్లా వార్తలు