close

బుధవారం, మే 23, 2018

తాజా వార్తలు

అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం   

హిరమండలం, న్యూస్‌టుడే : అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజేతలుగా నిలిచి  జిల్లాకు గుర్తింపు తెచ్చారు హిరమండలానికి చెందిన శ్రీచరణ్‌, రజిత. శ్రీలంకలో మతాలే రాష్ట్రం మహాత్మాగాంధీ మెమోరియల్‌ సెంటర్‌లో  ఫిబ్రవరి 24న నిర్వహించిన 17వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌ పోటీల్లో వీరు ప్రతిభ చూపి బంగారు, కాంస్య పతకం సాధించారు. భారతదేశం, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, జపాన్‌, మలేషియా దేశాలకు చెందిన కరాటే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తరపున హిరమండలానికి చెందిన శ్రీచరణ్‌ అండర్‌-14, 15 ‘కుమిటీ’ విభాగంలో పాల్గొని బంగారు పతకం సాధించాడు. కటా విభాగంలో హిరమండలంకు చెందిన రజిత మూడో స్థానంలో నిలిచి కాంస్య సాధించింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు