close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

విశ్రాంత అధ్యాపకుల సమస్యలపై పోరాడుదాం

ఎన్‌పీఎస్‌ కళాశాల (చిత్తూరు విద్య), న్యూస్‌టుడే: విశ్రాంత అధ్యాపకుల సమస్యల పరిష్కారాల కోసం ఐక్యంగా పోరాడుదామని అఖిల భారత విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, ఉపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి పార్థసారథి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎన్‌పీఎస్‌ మహిళా కళాశాలలో ఆ సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్చి నెలాఖరుకల్లా యూజీసీకి సంబంధించిన వేతనాలు విశ్రాంత అధ్యాపకులకు వర్తింపు చేసే విధంగా ప్రభుత్వ ఉత్తర్వు విడుదల చేసేందుకు సంఘం తరఫున కృషి చేస్తామని చెప్పారు. అనంతరం నూతన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ..విశ్రాంత అధ్యపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడిగా మణినాయుడు (చిత్తూరు), ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు (విజయవాడ), కోశాధికారిగా ఈశ్వరప్రసాద్‌లను ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు హరినాయుడు, వినాయకం, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు