close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

సామాజిక న్యాయంతోనే బహుజనుల సాధికారత

చిత్తూరు (సంతపేట), న్యూస్‌టుడే: సామాజిక న్యాయం సాధించడం ద్వారానే బహుజనుల సాధికారత సాధ్యమవుతుందని సెంటర్‌ ఫర్‌ బహుజన డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేశవులు తెలిపారు. ఆదివారం స్థానిక గిరింపేటలోని యాదవ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, ఉద్యోగ తదితర రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. రానున్న ఏప్రిల్‌లో సామాజిక న్యాయం-బహుజన సాధికారత అంశంపై చిత్తూరులో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపినాయక్‌, కన్వీనర్‌ ప్రసన్న వెంకటేశం, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటామోహన్‌, నాయకులు సోమరాజులు, రవి, తులసీరాం, గోవిందన్‌, తారకరామ్‌, శేఖర్‌, గోవిందస్వామి, మధు తదితరులు పాల్గొన్నారు.a

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు