close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

జిల్లా సచివాలయంలో నేడు ‘మీకోసం’

చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: జిల్లా సచివాలయంలో సోమవారం మీకోసం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పాలనాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య కాల్‌యువర్‌ కలెక్టరు ఫోన్‌ఇన్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా సచివాలయానికి రాలేని వారు నిర్దేశించిన సమయంలో 08572-240333 నంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలపవచ్చన్నారు. 10.30 గంటల నుంచి మీకోసం ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం అవుతుందన్నారు. మీకోసం కార్యక్రమంలో ఇచ్చే వినతులకు ఆధార్‌కార్డు నకలు జత చేయాలన్నారు. వినతులను జిల్లా సచివాలయంలో మీకోసం ఆన్‌లైన్‌ నమోదు కేంద్రంలో ఇచ్చి రసీదు పొందాలన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు