close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

సంస్కృత కళాశాల పరిరక్షణకు చర్యలు 

 

విజయనగరం గంటస్తంభం, న్యూస్‌టుడే: సంస్కృత కళాశాల అభ్యున్నతికి చర్యలు చేపడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చినట్లు కళాశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధి గుమ్మలూరు విశాలాక్షి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాల అభ్యున్నతి కోసం చేపట్టిన సంతకాల సేకరణ పోస్టరును, వినతిపత్రాన్ని విశాఖలో మంత్రి గంటాకు అందజేశామని తెలిపారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, గజపతినగరం శాసనసభ్యులు మీసాల గీత, కె.ఎ.నాయుడులతోపాటు, కళాశాల పూర్వ వైభవ కమిటీ సభ్యులు, శాసనమండలి సభ్యురాలు జి.సంధ్యారాణి పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు