close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

విషయంపై స్పష్టత వక్తకే సాధ్యం 

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: విషయంపై స్పష్టత వక్తకే సాధ్యమని ప్రజాకవి గండ్రేటి గౌరునాయుడు అన్నారు. ఆదివారం కంటోన్మెంట్‌ గురజాడ పబ్లిక్‌ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వక్త-2018 జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన గౌరునాయుడు మాట్లాడుతూ మేథావులు, విద్యావంతులు కావాలంటే చదువుతో పాటు మాట్లాడే తీరు, విధానం ఉండాలన్నారు. వక్తగా రాణించే మనిషిలో భయం, బిడియం పోతుందని తెలిపారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలకు సీఐ శ్రీహరిరాజు, జేవీవీ జాతీయ నాయకులు డాక్టర్‌ ఎం.వి.ఆర్‌.కృష్ణాజీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సీహెచ్‌.జయశ్రీ (ఆర్‌.కె.డిగ్రీ కళాశాల) ద్వితీయ బహుమతి ఎల్‌.సాయిగణేష్‌ (ఎస్‌.కె.డిగ్రీ కళాశాల), తృతీయ బహుమతి ముందారామ్‌ (ఆర్‌.కె.జూనియర్‌ కళాశాల), ప్రోత్సాహక బహుమతి సురేష్‌, ఝాన్సీలకు దక్కాయి. జేవీవీ జాతీయ విద్యా విభాగం కన్వీనర్‌ ఎ.వి.రాజశేఖర్‌ నిర్వహణలో పోటీలు జరిగాయి.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు