close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

గిరిజన ఉపాధ్యాయుల సంఘీభావం 

గిరిజన ఉపాధ్యాయుల సంఘీభావం 


గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చొద్దన్న డిమాండ్‌తో స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి ఆదివారం గిరిజన ఉపాధ్యాయులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు టి.శంకరరావు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని రంగాల్లో గిరిజనులు వెనుకబడి ఉన్నారని, బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చితే మరింత వెనుకబాటుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి నెలకొంటుందన్నారు. తక్కువ జనాభా ఉన్న గిరిజనుల్లో గిరిజనేతరులను చేర్చే ప్రక్రియ ఉపసంహరించుకోవాలన్నారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మండంగి రమణ మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం 30 లక్షల మంది గిరిజనులకు తీవ్ర అన్యాయం జరగనుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు