close

శనివారం, సెప్టెంబర్ 22, 2018

తాజా వార్తలు

కళతో మెప్పించారు 

బొబ్బిలిలో ఉత్తరాంధ్ర పౌరాణిక, పద్య నాటక పోటీలు 
మూడు జిల్లాలకు చెందిన కళాకారులు హాజరు 

కళతో మెప్పించారు 

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం బొబ్బిలి వేణుగోపాల నాటక కళాసమితి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పద్యపౌరాణిక నాటక పోటీలు అట్టహాసంగా సాగాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన పలువురు కళాకారులు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. పడకసీను, అరణ్యసీను, శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, బత్తెం శ్రీను, యయాతి, చింతామణి, తడుపుసీను, కురుక్షేత్రంలో రాయబారం, చింతామణి, హరిశ్చంద్ర, వారణాశి విజయాలు వంటి పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రభుత్వ మాజీ విప్‌ శంబంగి వెంకటచినప్పలనాయుడు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. రౌతు రామ్మూర్తినాయుడు, కర్రి సత్యనారాయణ, కె.శ్రీరామ్మూర్తి, పి.కృష్ణమూర్తి, డి.చిరంజీవినాయుడు, చప్ప కృష్ణమూర్తి, మీసాల సూర్యనారాయణతో పాటు పలువురు హాజరయ్యారు. డి.వి.అప్పారావు ఈ కార్యక్రమానికి సారధ్యం వహించారు. వృద్ధ కళాకారులు పెందుర్తి ఆచారి, దత్తి అప్పలనాయుడు, ఈదుబిల్లి గుంపస్వామి, చంద్రశేఖర్‌ పట్నాయక్‌,  సున్న జనార్దనరావులను నిర్వాహకులు సత్కరించారు.

జిల్లా వార్తలు