close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 

ప్రారంభమైన ఖాద్రీశుని తిరునాళ

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీలక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీఖాద్రీశుని తిరునాళ్లకు నాంది పలుకుతూ అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులు ఆస్థాన మండపానికి వేంచేశారు. అక్కడి నుంచి కలశాన్ని యాగశాలకు తీసుకెళ్లి స్థాపన చేశారు.  అంతకు ముందే ఆలయ పూజారులు ఆలయం చుట్టూ ఉన్న గుళ్లలో పూజలు చేశారు. అంకురార్పణకు అవసరమైన మట్టి కోసం అర్చకులు మేళతాళాలతో ప్రత్యేక పల్లకిలో స్వామివారితో ఆలయంలోని నాగుల కట్టకు వెళ్లారు. అక్కడ పుట్టమట్టికి ప్రత్యేక పూజలను భక్తిశ్రద్ధలతో జరిపారు. పూజలు చేసిన మట్టిని ప్రత్యేక పల్లకిలో యాగశాలకు తీసుకొచ్చారు. యాగశాలలో మట్టిపాత్రలతో మట్టి, నవధాన్యాలతో నింపి మొలకపోశారు. ఇలా మొలక పోసిన పాత్రలలో నవధాన్యాల మొలక ఏవైపు ఉన్న పాత్రలో బాగా మొలిస్తే ఆ ప్రాంతం పాడి, పంటలు సమృద్ధిగా కలిగి ప్రజలు సుభిక్షంగా జీవనం గడుపుతారని విశ్వాసం. అంకురార్పణ కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్‌, ఆలయ కమిటీ ఛైర్మన్‌ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఈవో వెంకటేశ్వరరెడ్డి, సభ్యులు మోపూరిశెట్టి చంద్రశేకర్‌, సురగాని రవికుమార్‌, ఇద్దేరఘునాథరెడ్డి, గంగులమ్మ, కరెనాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు