close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

ఇంటర్‌ ప్రశ్నపత్రాలొచ్చేశాయ్‌ 

అనంతపురం విద్య,న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షల ప్రశ్నపత్రాలను గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆయా పోలీసు స్టేషన్లకు ఆదివారం తరలించారు. ఇంటర్‌ పరీక్షలు ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. మొత్తం మూడు రూట్లుగా విభజించి జిల్లాలోని 37 పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈనెల 28న ఉదయం మంత్రి గంటాశ్రీనివాసరావు, కమిషనరు ఉదయలక్ష్మి ఏసెట్‌, ఏకోడ్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను విద్యార్థులకు ఇవ్వాలో లాటరీ పద్ధతిలో తీస్తారు.ఈమేరకు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఆయా పరీక్షా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మన జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మొత్తం 34309, ద్వితీయ ఇంటర్‌లో 34758మంది విద్యార్థులు హాజరు కానున్నారు.మూడు సెట్ల ప్రశ్నపత్రాలు పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. ఒక సెట్‌ను పరీక్షలకు ఉపయోగిస్తే మిగిలిన సెట్‌ను సప్లిమెంటరీ పరీక్షలకు ఉపయోగిస్తారు. ప్రశపత్రాల పంపిణీ ప్రక్రియను ఆర్‌ఐఓ సురేష్‌బాబు, జిల్లా వృత్తివిద్య అధికారి చంద్రశేఖర్‌రావు, సీనియర్‌ ప్రధానాచార్యులు రాజారావు ఆయా కేంద్రాలకు పంపారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు