close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

ఉచిత న్యాయంపై విస్తృత ప్రచారం చేయాలి

మూడోరోడ్డు(అనంతపురం), న్యూస్‌టుడే: న్యాయశాఖ అందజేస్తున్న ఉచిత న్యాయ సహాయంపై కక్షిదారులకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి గ్రేస్‌ మేరీ అన్నారు. ప్యానల్‌ న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవాసదన్‌లో ఆదివారం రెండో రోజు పలు చట్టాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి గ్రేస్‌ మేరీ మాట్లాడుతూ పేద, మద్య తరగతి వర్గాలకు చెందిన కక్షిదారులకు న్యాయశాఖ ఉచిత న్యాయ సహాయం అందజేస్తుందన్నారు. ఈ విషయాన్ని కక్షిదారులకు తెలియజేయాలన్నారు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిన (హిట్‌ అండ్‌ రన్‌) కేసుల్లో బాధితులకు పరిహారం అందుతుందన్నారు. గాయాల పాలైతే రూ.50 వేలు, మరణిస్తే రూ.2 లక్షలు పరిహారంగా ఇస్తారన్నారు. అనంతరం మాస్టర్‌ ట్రైనర్‌ సుబ్బారావు బాధితుల పరిహార చట్టం, ఖైదీల హక్కులు, సీనియర్‌ సిటిజన్ల హక్కులు, మోటారు వాహనాల చట్టం తదితర వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధమ్మ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు