close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

భగవంతుడి ప్రేమతో ఏదైనా సాధించవచ్చు.. 

భగవంతుడి ప్రేమతో ఏదైనా సాధించవచ్చు.. 

పుట్టపర్తి, న్యూస్‌టుడే: భగవంతుడిని ప్రేమతో ఆరాధిస్తే.. ఏదయినా సాధించవచ్చుననే తెలియజేసే సందేశాన్ని విద్యార్థులు నృత్యరూపకంలో తెలియజేశారు. ఆదివారం సాయికుల్వంత్‌ మందిరంలో ఆదిలాబాద్‌ సాయియూత్‌, బాలవికాస్‌ విద్యార్థులు సంయుక్తంగా ‘ప్రేమసాయిరాం’ నాటికను ప్రదర్శించారు. భగవంతుడిపై భారం వేసి, మనం ముందుకు సాగితే తప్పక లక్ష్యానికి చేరువుతామని, భగవంతుడు భక్తుల హృదయాల్లో కొలువై ఉంటారనే సందేశాన్ని నృత్యరూపకంలో ఆవిష్కరించారు. శ్రీకృష్ణుడు..భక్తుల మధ్య సంభాషణ, పాండవులు..కౌరవులు రాజ్యపాలనలో ధర్మం గెలుస్తుందని తెలిపే సందేశాన్ని వివరించారు. కృష్ణుడు గోపికల నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. భక్తులు, సాయియూత్‌ సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలను కమనీయంగా ఆలపించారు. వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సోమవారం పట్టణంలో ఆదిలాబాద్‌ భక్తులు మహానగర సంకీర్తన నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు