close

బుధవారం, మే 23, 2018

తాజా వార్తలు

బౌద్ధరామం ఏర్పాటుపై సదస్సు


ఉండ్రాజవరం,న్యూస్‌టుడే: తెలుగు ప్రజల ఔన్నత్యానికి రాష్ట్ర రాజధాని అమరావతిలో బౌద్ధారామం ఎంతగానో ఉపయోగపడుతుందని బౌద్ధభిక్షువు అనాలయొ తెలిపారు.తెలుగు బౌద్ధభిక్షువుల ఆధ్వర్యంలో అమరావతిలో తెలుగు బౌద్ధారామం ఏర్పాటుపై స్థానిక బౌద్ధధర్మపీఠంలో సదస్సును ఆదివారం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి బౌద్ధభిక్షువులు, ప్రచారకులు, ఆచరణ వాదులు, ఉపాసకులు విచ్చేసి మాట్లాడారు. తెలుగు బౌద్ధారామం ఏర్పాటు వల్ల నలంద, తక్షశిల వలే అమరావతి వెలుగొందుతుందని వివరించారు.
బౌద్ధపీఠం దానం 
మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో బౌద్ధభిక్షువు అనాలయొ ఆధ్వర్యంలో నిర్మించిన బౌద్ధధమ్మ పీఠాన్ని భిక్షువుల సమక్షంలో ఆదివారం దానం చేశారు. త్రిపురకు చెందిన బౌద్ధభిక్షువు శీలానంద బంతీజీకి దానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆరాధన చేశారు. ఇక నుంచి శ్రామణీరలు (బౌద్ధవిద్యార్థులు),పీఠం నిర్వహణ శీలానంద నిర్వహిస్తారన్నారు.పలు ప్రాంతాల నుంచి వచ్చిన భిక్షువులతో పాటు సర్పంచి గన్నమని వెంకటసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు